Revanth Reddy: నేను కందిపప్పు... కేటీఆర్ గన్నేరు పప్పు!: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy counter to Minister KTR
  • కేటీఆర్ చెప్పినట్లు నేను పప్పునే... కానీ ఆరోగ్యానికి మంచి చేసే కందిపప్పును అన్న రేవంత్ రెడ్డి
  • కేటీఆర్ మాత్రం గన్నేరుపప్పు లాంటి వాడని విమర్శలు
  • కందిపప్పు... ముద్దపప్పు తినవచ్చు.. కానీ గన్నేరుపప్పును తింటే చనిపోతారని వ్యాఖ్య
తనను తెలంగాణ పప్పు అన్న మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చెప్పినట్లు తాను పప్పునేనని, కానీ ఆరోగ్యానికి మంచి చేసే కందిపప్పునని అన్నారు. కానీ కేటీఆర్ మాత్రం గన్నేరుపప్పులాంటి వాడని, అది తింటే చస్తారన్నారు. ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎవరైనా కందిపప్పు, ముద్దపప్పు తీసుకోవాలన్నారు. గన్నేరుపప్పు మాత్రం తీసుకోవద్దన్నారు. 

కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఇలాంటి ద్రోహుల్ని తన్ని తరిమేయాలన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శమని చెప్పిన బీఆర్ఎస్ నేతలు... కర్ణాటకలో కాంగ్రెస్ అది చేయలేదు... ఇది చేయలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారని... అంటే బీజేపీ గెలవాలా? అని రేవంత్ ప్రశ్నించారు. తాము 2050 ప్రణాళికతో ముందుకు వస్తున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.
Revanth Reddy
Congress
KTR
Telangana Assembly Election

More Telugu News