YS Sharmila: అసెంబ్లీ ఎన్నికల్లో 'వైఎస్ షర్మిల త్యాగం'పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందన!

  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న షర్మిల
  • అందుకే తాము ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
  • కేసీఆర్ నీచపాలన అంతమొందించేందుకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • షర్మిలకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్
Telangana Congress responds on Sharmila decision

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఆ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'థ్యాంక్యూ... షర్మిల గారు' అని ట్వీట్ చేశారు.

అంతకుముందు షర్మిల ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ట్వీట్ కూడా చేశారు. బీఆర్ఎస్ నీచపాలన అంతం కోసం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని, కేసీఆర్ అవినీతి రౌడీరాజ్యం అంతమొందించగలిగే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలకూడదనే ఉద్దేశంతో తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బాగు, భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఓ లేఖ రాశారు.

  • Loading...

More Telugu News