Cricket: గిల్ సెంచరీ మిస్సవ్వడంపై సారా టెండూల్కర్ రియాక్షన్.. ఫొటో వైరల్‌

Sara Tendulkars reaction on Gills century miss grabs internet attention gone viral
  • అనూహ్యంగా సెంచరీ చేజారడంతో నిరాశకు లోనైన సచిన్ కూతురు
  • కొద్దిక్షణాల్లోనే నిలబడి చప్పట్లు కొడుతూ గిల్‌కు అభినందనలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
గురువారం శ్రీలంకపై మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో మొదటి సెంచరీని నమోదు చేస్తాడని అనిపించింది. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి దూకుడు మీద కనిపించినప్పటికీ  దురదృష్టవశాత్తూ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. మదుశంక బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సెంచరీకి చేరువయ్యి ఔటవ్వడంతో ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు. అయితే సచిన్ టెండూలర్క్ కూతురు సారా టెండూల్కర్ స్పందించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూస్తూ ఆమె ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సెంచరీకి చేరువైన తరుణంలో అనూహ్యంగా గిల్ ఔట్ అవ్వడం సారా నిరాశకు లోనైనట్టు కనిపించింది. రెండు చేతులు నోటిమీద వేసుకొని ‘అయ్యో..’ అనే రియాక్షన్ ఇచ్చారు. అయితే కొద్ది క్షణాల్లో నిలబడి చప్పట్లతో గిల్‌ని అభినందిస్తూ ఆమె కనిపించారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె రియాక్షన్స్‌కు ప్రాధాన్యత దక్కింది.
Cricket
Team India
Shubman Gill

More Telugu News