ఈటల రాజేందర్ గెలవాలని, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ప్రజలు అంటున్నారు: ఈటల జమున
- హుజూరాబాద్ ప్రజలు ఈటలకు తప్ప మరో పార్టీకి ఓటు వేసే అవకాశం లేదన్న జమున
- హుజూరాబాద్, గజ్వేల్.. ఈ రెండూ ఈటలకు రెండు కళ్లు అని వ్యాఖ్య
- అందుకే ఈటలను ఏడుసార్లు గెలిపించారని వెల్లడి
మా సారు గెలవాలే... ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనేది ప్రజల నినాదంగా ఉందన్నారు. ఈటల రాజేందర్ ఇక్కడ నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ కష్టసుఖాల్లో వారికి తోడుగా ఉన్నానని చెప్పారు. మేమంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఇష్టమని, వారంటే మాకు ఇష్టమన్నారు. అందుకే ఈటలను ఏడుసార్లు గెలిపించినట్లు చెప్పారు. ఉప ఎన్నిక విజయమే... డిసెంబర్ 3న రిపీట్ అవుతుందన్నారు.