Daughter in law: మామను సజీవంగా తగలబెట్టేందుకు ప్రయత్నించిన కోడలు.. వీడియో వైరల్!

Woman Allegedly Sets Father In Law s Room On Fire
  • బెడ్ పై నిద్రిస్తున్న వృద్ధుడి పైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిన వైనం
  • వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పిన మహిళ భర్త
  • తన తండ్రిని చంపాలని భార్య ప్రయత్నిస్తోందని ఆవేదన
  • భార్య నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త
బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. భార్య నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. మంచానికి పరిమితమైన వృద్ధుడిపై ఈ దాష్టీకం ఏంటని తీవ్రంగా మండిపడుతున్నారు.

వీడియోలోని వివరాల ఆధారంగా.. సదరు మహిళ ఆ వృద్ధుడి కోడలు అని తెలుస్తోంది. ఏంజరిగిందో ఏమో కానీ మామ గదికి నిప్పంటించి చంపేయాలని కోడలు ప్రయత్నించింది. ఓ పేపర్ కు నిప్పంటించి, కాలుతున్న ఆ పేపర్ ను మామ బెడ్ పై పడేసింది. బట్టలకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడితే అందులో పడి మామ చనిపోతాడనే ఉద్దేశంతో చేసినట్లుంది. అప్పటికే జరుగుతున్న గొడవను ఫోన్ లో రికార్డు చేస్తున్న ఆమె భర్త వెంటనే స్పందించాడు. బెడ్ కు మంటలు అంటుకోకుండా పేపర్ ను కిందకు తోసేశాడు. తన తండ్రిని చంపేయాలని తన భార్య ప్రయత్నిస్తోందని అన్నాడు. ఈ హడావిడికి నిద్రలో నుంచి మేల్కొన్న వృద్ధుడు.. తన బెడ్ పై మంటలు చూసి షాక్ కు లోనయ్యాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.
Daughter in law
Murder attempt
Father in law
fire on bed
sets fire on bed
Viral Videos

More Telugu News