Chandrababu: చంద్రబాబును కలిసిన ఏఐజీ ఆసుపత్రి వైద్యులు

AIG medical team meets babu at his jubileehills residence
  • జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసంలో ఆయనను కలిసిన వైద్య బృందం
  • బాబు ఆరోగ్య సమస్యల గురించి వాకబు
  • వైద్యుల సూచన మేరకు రేపు ఉదయం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్న బాబు
వైద్య చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబును ఏఐజీ ఆసుపత్రి వైద్యుల బృందం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా వైద్యులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైద్యుల సూచన మేరకు బాబు రేపు ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. 

స్కిల్ కేసులో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో జ్యుుడీషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు మంగళవారం మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం, అభిమానుల ఆనందోత్సాహల నడుమ ఆయన ఈ ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తరువాత తన కుటుంబసభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.
Chandrababu
Telugudesam
Hyderabad

More Telugu News