Balakrishna: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'భగవంత్ కేసరి'

  • ఘన విజయం సాధించిన బాలయ్య చిత్రం 'భగవంత్ కేసరి'
  • ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు
  • ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తోందని ప్రచారం
Balakrishna Bhagavanth Kesari movie OTT release

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'భగవంత్ కేసరి' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తిక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి వస్తోందనేదే ఆ వార్త. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని చెపుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్రను పోషించగా... యువ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు క్యారెక్టర్లో నటించింది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

More Telugu News