Raghavendra Rao: చంద్రబాబుతో కలిసి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం: కె.రాఘవేంద్రరావు

We are ready to walk with Chandrababu says Raghavendra Rao
  • చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంపై రాఘవేంద్రరావు ఆనందం
  • కోట్ల మంది ప్రార్థనలతో బయటకు వచ్చారన్న దర్శకేంద్రుడు
  • బాబుకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
రాజమండ్రి జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై విడుదల అవ్వడంపై ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని కోట్ల మంది ప్రజల గుడ్ విషెస్, ప్రేయర్స్ తో చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్త ఉత్సాహంతో మీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 

Raghavendra Rao
Tollywood
Chandrababu
Telugudesam

More Telugu News