Jayaprada: చంద్రబాబు బెయిల్‌పై నటి జయప్రద స్పందన

Jayaprada response on Chanrababu arrest
  • చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్న జయప్రద
  • కక్షపూరిత రాజకీయాలతోనే జైలుకు పంపారని విమర్శ
  • ఇలాంటి అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్య

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైలు నుంచి నిన్న ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద స్పందిస్తూ... చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇలాంటి అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News