Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్‌మీట్లు.. సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలుపై హైకోర్టులో కేసు

  • వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి పిటిషన్
  • ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు
  • కోర్టు అనుమతితో వివరాలు సేకరించాలని పిటిషనర్‌ కు న్యాయస్థానం ఆదేశాలు 
  • తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
Case filed against AP Cid chief Sanjay and additional AJ Ponnavolu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా మీడియా సమావేశాలు పెట్టారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌‌ను హైకోర్టు విచారించింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, కాబట్టి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. 

దీనికి స్పందించిన న్యాయస్థానం.. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News