Gaza Strip: గాజా టన్నెళ్లలోకి తొలిసారిగా రష్యా జర్నలిస్ట్ విజిట్.. వీడియో ఇదిగో!

Hamas Gives Russian Journalists Tour Of Their Gaza Strip Tunnels
  • భూగర్భంలో 300 మైళ్ల పొడవున్న ‘గాజా మెట్రో’
  • ఈ టన్నెళ్లు తమ కోసమే నిర్మించుకున్నామని మిలిటెంట్ల వెల్లడి
  • గాజా ప్రజలను కాపాడే బాధ్యత యూఎన్, ఇజ్రాయెల్ లదేనన్న హమాస్
  • పాత వీడియోను హమాస్ గ్రూప్ ఇప్పుడు రిలీజ్ చేసినట్లు అనుమానాలు

గాజాలోని టన్నెళ్లలోకి తొలిసారిగా ఓ జర్నలిస్టు విజిట్ చేశాడు.. అక్కడున్న హమాస్ మిలిటెంట్ల టాప్ లీడర్ల ఇంటర్వ్యూ తీసుకున్నాడు. దాదాపు 300 మైళ్ల (482 కి.మీ.) పొడవున్న సొరంగాల్లోకి రష్యా జర్నలిస్టు వెళ్లాడు. లోపల పలువురు హమాస్ లీడర్లతో మాట్లాడుతూ.. కాంక్రీట్ తో నిర్మించిన ఈ టన్నెళ్లు శత్రు దుర్భేద్యంగా ఉన్నాయని, గాజా ప్రజలకు ఎందుకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వరని ప్రశ్నించాడు. 

దీనికి ఓ మిలిటెంట్ లీడర్ స్పందిస్తూ.. గాజా ప్రజల రక్షణ బాధ్యత ఐక్యరాజ్య సమితిదేనని చెప్పాడు. వారిని కాపాడాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ కూ ఉందని, దాడులు చేసే ముందు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. గాజాలోని సొరంగాలన్నీ తమ రక్షణ కోసం తయారుచేసుకున్నవని వివరించాడు. హమాస్ ఇంజనీర్లు ఎంతో కష్టపడి డిజైన్ చేసి నిర్మించారని చెప్పాడు. దాడుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వీటిని ఏర్పాటు చేసుకున్నామని వివరించాడు.

కాగా, ఈ వీడియో క్లిప్ పాతదని, ఇజ్రాయెల్ తో యుద్ధం మొదలు కాకముందు తీసినదని సమాచారం. ఇంటర్వ్యూలో ఓ మిలిటెంట్ చెప్పిన విషయం కూడా ఈ అనుమానానికి ఊతమిస్తోంది. ఈ టన్నెళ్లలో హమాస్ ఫైటర్లు నెలల తరబడి ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వెల్లడించాడు. చుట్టూ ఆయుధాలు ధరించిన మిలిటెంట్లు, చేతిలో ఆయుధాలతో అటూ ఇటూ తిరగడం వీడియోలో కనిపిస్తోంది. 

ఒకచోట కొంతమంది టన్నెల్ ను మరింత పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. చేతులతోనే మట్టిని తవ్వుతూ సొరంగాన్ని పొడిగిస్తున్నారు. 2014 లో హమాస్ సొంత న్యూస్ పేపర్ కు చెందిన రిపోర్టర్ ఒకతను పోస్ట్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో టన్నెల్ ను తవ్వుతున్న హమాస్ మిలిటెంట్లను చూపిస్తూ.. ‘మీరు తవ్వే ప్రతీ అంగుళం ఇజ్రాయెల్ సైనికుల రక్తం చిందించేందుకు తోడ్పడుతుందని’ వారిని మోటివేట్ చేసినట్లు చెప్పాడు.

  • Loading...

More Telugu News