State Election Commission: రేపు తెలంగాణకు ఈసీ బృందం... ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

EC team will reach hyderabad tomorrow
  • సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రాక
  • రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటన
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర అధికారులతో సమావేశం
నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం బుధవారం తెలంగాణకు రానుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈసీ బృందం... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా ఎన్నికల సంఘం అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం అవుతారు. తనిఖీలు, స్వాధీనాలపై ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితరాలపై చర్చిస్తారు.
State Election Commission
cec
Telangana Assembly Election

More Telugu News