Chandrababu: చంద్రబాబు కోసం జైలు వద్దకు చేరుకున్న ఎన్ఎస్జీ కమెండోలు.. టీడీపీ శ్రేణులు రాకుండా జైలు వద్ద భారీ భద్రత

NSG commandos reaches Rajahmundry jail as Chandrababu is releasing
  • కాసేపట్లో జైలు నుంచి విడుదల అవుతున్న చంద్రబాబు
  • జైలు వద్దకు చేరుకున్న నారా లోకేశ్, బ్రాహ్మణి
  • రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు ర్యాలీగా వెళ్లనున్న బాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం బెయిల్ కు సంబంధించిన ష్యూరిటీలను టీడీపీ నేతలు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులు కూడా సెంట్రల్ జైలుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానున్నారు. 52 రోజుల తర్వాత ఆయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు. 

చంద్రబాబు విడుదల అవుతున్న నేపథ్యంలో జైలు వద్దకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎన్ఎస్జీ కమెండోలు చేరుకున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా జైలు వద్దకు చేరుకున్నారు. మరోవైపు జైలు వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఏ ఒక్క టీడీపీ నేత కూడా అక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు, జైలు నుంచి అమరావతిలోని ఉండవల్లి నివాసం వరకు చంద్రబాబు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నేతలు పూర్తి చేశారు.
Chandrababu
Telugudesam
Release

More Telugu News