Chaittarapu Pushpita Laya: బీఎస్పీ నుంచి హిజ్రాకు వరంగల్ తూర్పు టికెట్.. సంబరాల్లో ట్రాన్స్‌జెండర్లు

Transgender Chittarapu Pushpita Laya Got Warangal East BSP Ticket
  • చిత్తారపు పుష్పిత లయకు టికెట్ కేటాయించిన బీఎస్పీ
  • పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పుష్పిత
  • తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానన్న లయ
తెలంగాణ శాసనసభకు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తొలిసారి ఒక ట్రాన్స్‌జెండర్ ఓ పార్టీ టికెట్‌పై పోటీచేయబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో బీఎస్పీ తెలంగాణలో ఈసారి అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ 43 మంది అభ్యర్థులతో తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో వరంగల్ తూర్పు స్థానాన్ని చిత్తారపు పుష్పిత లయకు కేటాయించింది. కరీమాబాద్ నివాసి అయిన పుష్పిత ట్రాన్స్‌జెండర్. బీఎస్పీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమెకు టికెట్ రావడంతో హిజ్రాలు సంబరాలు చేసుకుంటున్నారు. 

బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పిత మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని, విద్యావంతురాలిగా తానేంటో నిరూపించుకుంటానని పేర్కొన్నారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Chaittarapu Pushpita Laya
BSP
Telangana
Warangal East

More Telugu News