Andhra Pradesh: చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై అంబటి రాంబాబు ఏమన్నారంటే..!

Minister Ambati Rambabu Tweet on Chandrababu Interium bail
  • నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని వ్యాఖ్య
  • వ్యంగ్యంగా ట్వీట్ చేసిన వైసీపీ నేత
  • తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. కోర్టు తీర్పుపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. టీడీపీ నేతలు చెబుతున్నట్లు నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్లు కనిపించడంలేదు కాబట్టి బెయిల్ వచ్చిందని ట్వీట్ చేశారు.

మంత్రి ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజేశ్ వర్మ అనే యూజర్ స్పందిస్తూ.. ‘నీకూ కనిపించని రోజు వస్తుంది వెయిట్ చేయండి సర్’ అంటూ జవాబిచ్చారు. ‘ప్రూఫ్ ఉండి కాదు జైలులో పెట్టింది.. మీ జగన్ సైకో బుద్ధిని ప్రూఫ్ చేసుకోవడానికి జైలులో పెట్టింది’ అంటూ హరిణి అనే యూజర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ కు కౌంటర్ గా ఎక్స్ (ట్విట్టర్) యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
Andhra Pradesh
Chandrababu
interium bail
Ambati Rambabu
Twitter
YSRCP
TDP

More Telugu News