Virat Kohli: భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ కు గౌరవ అతిథి ఎవరంటే..!

70 K Kohli face masks to be distributed in India and South Africa match
  • నవంబర్ 5న కోల్ కతాలో ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్
  • అదే రోజున విరాట్ కోహ్లీ పుట్టినరోజు
  • గౌరవ అతిథిగా హాజరుకానున్న అమిత్ షా
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. పెద్ద జట్లు ఊహించని విధంగా పరాజయాలను మూటగట్టుకుంటుండగా... ఆఫ్ఘనిస్థాన్ వంటి చిన్ని జట్టు సంచలన విజయాలను సాధిస్తోంది. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో విజయదుందుభి మోగించింది. మరోవైపు నవంబర్ 5న కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్ మైదానంలో భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు గౌరవ అతిథిగా హాజరుకావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోరింది. దీనికి ఆయన సమ్మతం తెలిపారు. 

మరోవైపు, నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్ డే కావడంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. పుట్టిన రోజు నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కోహ్లీ ముఖంతో కూడిన 70 వేల మాస్క్ లను ప్రేక్షకులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు బౌండరీ లైన్ వెలుపల కోహ్లీతో కేక్ కట్ చేయించనున్నారు. 

Virat Kohli
Team India
South Africa
Eden Garden
Amit Shah
BJP

More Telugu News