Extra: నితిన్ 'ఎక్స్ ట్రా' ఆర్డినరీ మ్యాన్... టీజర్ ఇదిగో!

  • నితిన్, శ్రీలీల జంటగా 'ఎక్స్ ట్రా...'
  • వక్కంతం వంశీ దర్శకత్వం
  • సోషల్ మీడియాలో టీజర్ ను పంచుకున్న నితిన్
  • డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఎక్స్ ట్రా...'
Teaser out from Nithiin new movie Extra

టాలీవుడ్ కథానాయకుడు నితిన్ నటించిన 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మ్యాన్' చిత్రం టీజర్ నేడు విడుదలైంది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో నితిన్ "ఎంటర్టయిన్ మెంట్  బద్దలయిపోద్ది... ఇట్స్ మై ప్రామిస్" అంటూ హామీ ఇచ్చారు. నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ ట్రా...' చిత్రం రూపుదిద్దుకుంటోంది. నితిన్ కుటుంబ సభ్యులే ఈ చిత్ర నిర్మాతలు. 

ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, అన్నపూర్ణమ్మ, పవిత్ర, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఇవాళ విడుదలైన టీజర్ చూస్తే వినోదానికి లోటు లేదనిపిస్తోంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News