తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీకి కూడా భద్రత లేదు.. కేవలం వారికి మాత్రమే భద్రత ఉంది: రఘునందనరావు రీట్వీట్
- తెలంగాణ బీజేపీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రఘునందనరావు
- తెలంగాణలో కేసీఆర్ పిల్లలు, మనవళ్లకు మాత్రమే భద్రత ఉందని వ్యాఖ్య
- బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ గూండాలు దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం
రఘునందరావు అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ... కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు. తాను గెలుస్తున్నాననే అధికార బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎంపీపై బీజేపీ కార్యకర్త కనుక దాడికి పాల్పడితే అతడిని తానే తీసుకు వచ్చి పోలీసులకు అప్పగిస్తానని సవాల్ చేశారు.