Raghu Rama Krishna Raju: ఒక్కో మహిళ నుంచి జగన్ రూ. 1.82 లక్షలు దోచుకున్నారు: రఘురామకృష్ణరాజు

Jagan looted every women in AP says Raghu Rama Krishna Raju
  • జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ రూ. 200కి పెరిగిందన్న రఘురాజు
  • అమ్మఒడి, చేయూత లబ్ధిదారులైన మహిళల భర్తలు రోజుకు క్వార్టర్ తాగుతున్నారని వ్యాఖ్య
  • ప్రతి ఒక్కరూ తమ ఓట్లను చెక్ చేసుకోవాలని సూచన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో మద్యం మీద ఒక్కో మహిళ నుంచి జగన్ రూ. 1.18 లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. అక్రమ మద్యం అమ్మకాలు, మద్యం ధరలతో మహిళను దోచుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో నాణ్యమైన మద్యం క్వార్టర్ ధర రూ. 60 ఉండేదని... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 200కు చేరిందని దుయ్యబట్టారు. అమ్మ ఒడి, చేయూత అంటూ మహిళలకు జగన్ డబ్బులు వేస్తున్నాడని... అయితే, లబ్ధిదారులైన సదరు మహిళల భర్తలు రోజుకు ఒక క్వార్టర్ మద్యం తాగుతున్నారని... రోజుకు ప్రభుత్వానికి రూ. 140 కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని... ఈ లెక్కన ఏడాదికి రూ. 50,400 ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. 

ఈ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ఒక్కో ఓటుకు రూ. 2 నుంచి 3 వేలను జగన్ ఇప్పిస్తాడని రఘురాజు తెలిపారు. ఈ సొమ్మును తీసుకుని ఓట్లు మాత్రం వైసీపీకి వేయొద్దని ఓటర్లను కోరారు. నాసిరకం మద్యం తాగి 35 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న వారు చాలా మంది మరణించినట్టుగా నివేదికలు ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని... ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? చెక్ చేసుకోవాలని సూచించారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News