air defence system: ఐదేళ్లలో మనకూ దేశీ ఐరన్ డ్రోమ్

  • శత్రుదేశాల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ
  • స్టెల్త్ ఫైటర్స్, క్షిపణులను గాల్లోనే పేల్చేయగలదు
  • అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో
  • 2028-29 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం
India aims to deploy indigenous long range air defence system

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ఐరన్ డ్రోమ్ పదం ఎక్కువగా వినిపించింది. హమాస్ నుంచి వస్తున్న క్షిపణుల నుంచి కాచుకునేందుకు ఐరన్ డ్రోమ్ అస్త్రాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఉపయోగించింది. అటువంటి ఐరన్ డ్రోమ్ దేశీయంగా రూపొందించినది మనకు కూడా అందుబాటులోకి రానుంది. కాకపోతే ఇందుకు 2028-29 వరకు సమయం పట్టనుంది. శత్రుదేశం నుంచి వచ్చే స్టెల్త్ ఫైటర్స్, యద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ ను సుదూరం నుంచే ఈ ఐరన్ డ్రోమ్ వ్యవస్థ గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తుంది. 350 కిలోమీటర్ల శ్రేణి పరిధిలో ఉన్న వాటిని తుత్తునియలు చేస్తుంది. 

దేశీ దీర్ఘకాల సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ‘కుశ’ పేరుతో అభివృద్ధి చేస్తోంది. దీన్ని రష్యాకు చెందిన ఎస్-400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పోల్చవచ్చు. ఎస్ 400 సిస్టమ్ ఇటీవలే భారత వాయు సేనకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇలాంటిదాన్నే ఇప్పుడు డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. దీనికి కేంద్ర కేబినెట్ 2022 మే నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Telugu News