CBI Lakshminarayana: వైసీపీ తరపున పోటీ చేస్తున్నారనే వార్తలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన

CBI Ex JD Lakshminarayana response on joining YSRCP
  • వైసీపీ ప్రభుత్వంపై ఇటీవల ప్రశంసలు కురిపించిన లక్ష్మీనారాయణ
  • ఆయన వైసీపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • ఈ వార్తల్లో నిజం లేదని చెప్పిన సీబీఐ మాజీ జేడీ
ముఖ్యమంత్రి జగన్ పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి కార్యక్రమమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా తయారయ్యాయని... అంగన్వాడీలలో చిన్న పిల్లలకు రాగిజావ ఇవ్వడం గొప్ప నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ ఊహాగానాలలో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలపై చర్చిస్తూ ప్రజలు అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తాను వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఓటర్లను చైతన్యం చేసే తన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
CBI Lakshminarayana
YSRCP

More Telugu News