ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంటుంది: కోమటిరెడ్డి ధీమా
- నాయకుల కోసం కాకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఉందన్న కోమటిరెడ్డి
- భువనగిరిలో నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాయాలన్న కాంగ్రెస్ నేత
- ఎన్నికలకు మరో 33 రోజులు మాత్రమే ఉందని వ్యాఖ్య
ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అయిదేళ్లు మీ కోసం మేమంతా కష్టపడతామన్నారు. తనకున్న 27 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని, కాంగ్రెస్ గెలుపు మీ బాధ్యతే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అనిల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నాడు తెలంగాణ ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశానన్నారు.