తెలంగాణ మోడల్ అంటే ఇదేనా?: కిషన్ రెడ్డి
- తరచూ టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాలు లీక్ కావడమే తెలంగాణ మోడలా? అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
- పిల్లర్లు కుంగిపోవడం, పంప్ హౌజ్ మునిగిపోవడం, మోటార్లు ఈత కొట్టడమేనా? అంటూ ఎద్దేవా
- మద్యం విధానంపై ఆధారపడటమే తెలంగాణ మోడలా? అని నిలదీత
'తరచుగా టీఎస్‌పీఎస్సీ పరీక్షాపత్రాలు లీక్ కావడం, పుట్టెడు అక్రమాలతో ప్రభుత్వ అసమర్థత, వైఫల్యం కారణంగా యువతలో ఆందోళన నెలకొనడం, వారు ఆత్మహత్యలకు పాల్పడుతుండటమే తెలంగాణ మోడలా? సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచి... డబ్బులు దండుకోవడం... ఆ తర్వాత పిల్లర్లు కుంగిపోవడం, పంప్‌హౌజ్‌లు మునిగిపోవడం, మోటార్లు ఈత కొట్టడమే... తెలంగాణ మోడలా?' అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మద్యం విధానంపై ఆధారపడటమే తెలంగాణ మోడలా? అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావడమే.. తెలంగాణ మోడలా? అంటూ చురకలు అంటించారు.