Nederlands: వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్... కానీ...!

  • వరల్డ్ కప్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ × నెదర్లాండ్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
Nederlands won the toss against Bangladesh

వరల్డ్ కప్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే ఆ జట్టు 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్ జోడీ సమయోచితంగా ఆడడంతో డచ్ జట్టు కోలుకుంది. ఎడ్వర్డ్స్ అర్ధసెంచరీ సాధించాడు. 

ప్రస్తుతం నెదర్లాండ్స్ స్కోరు 41 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు. ఎడ్వర్డ్స్ 55, ఎంగెల్ బ్రెక్ట్ 24 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 1, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.

More Telugu News