అందుకే చంద్రబాబుపై ప్రజలు సానుభూతి చూపించడం లేదు: విజయసాయిరెడ్డి
చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పక్కా ఆధారాలతో ఆయన అరెస్ట్ అయ్యారని చెప్పారు. చంద్రబాబుకు మోసం, దగా మాత్రమే తెలుసని చెప్పారు. బాబు వల్ల ఆయన వర్గీయులే బాగుపడ్డారని, అందుకే ఆయన పట్ల ప్రజలు సానుభూతి చూపడం లేదని అన్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందని చెప్పారు. లోకేశ్ కు నాయకత్వ లక్షణాలు లేవని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని లోకేశ్ చూస్తున్నాడని చెప్పారు. పురందేశ్వరిది నిలకడలేని రాజకీయమని విమర్శించారు. కుటుంబ, సొంత రాజకీయ అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని అన్నారు. సొంత సామాజిక వర్గం గురించి మాత్రమే ఆమెకు తెలుసని చెప్పారు.