Etela Rajender: బీసీలు అంటే కేసీఆర్ కు చిన్నచూపు.. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కంటతడి పెట్టుకున్నా: ఈటల రాజేందర్

KCR treats BCs very cheatp says  Etela Rajender
  • అందరినీ మోసం చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణను పాలిస్తోందని విమర్శ
  • అణగారిన వర్గాలను కాంగ్రెస్ కూడా చిన్నచూపు చూస్తోందని మండిపాటు
  • అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే బీజేపీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి 

బడుగు వర్గాలకు అధికారం రాకుండా అడ్డుకున్న చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. దళిత, గిరిజన, మైనార్టీ బిడ్డలను దేశ రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని చెప్పారు. బీసీలు అంటే కేసీఆర్ కు చిన్నచూపు, చులకన భావం అని దుయ్యబట్టారు. అందరినీ మోసం చేసి కేసీఆర్ కుటుంబం తెలంగాణను పాలిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో బీసీ వివక్ష చూసి చాలా సార్లు కంటతడి పెట్టుకున్నానని తెలిపారు. అణగారిన వర్గాలను కాంగ్రెస్ కూడా చిన్నచూపు చూసిందని విమర్శించారు. ఎంత మంది బీసీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు టికెట్లు ఇచ్చాయని ప్రశ్నించారు. కానీ బీజేపీ మాత్రం 40 టికెట్లను కేటాయించబోతోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే బీజేపీకి మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని అన్నారు

  • Loading...

More Telugu News