KTR: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్

  • కేటీఆర్‌ను కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ
  • కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు హామీ
  • గతంలోనే మున్సిపల్ శాఖ రద్దు విషయాన్ని తెలిపినట్లు గుర్తు చేసిన కేటీఆర్
  • పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని అధికారులకు ఆదేశం
Minister KTR cancels kamareddy master plan

కామారెడ్డి రైతు జేఏసీ బృందం శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై వారు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు.

More Telugu News