Chiranjeevi: ఆ చిత్రం నా జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్: చిరంజీవి

  • చిరంజీవికి స్టార్ డమ్ తెచ్చిన 'ఖైదీ' చిత్రం
  • 'ఖైదీ' విడుదలై నేటికి 40 ఏళ్లు
  • జ్ఞాపకాలను నెమరువేసుకున్న మెగాస్టార్
Chiranjeevi recalls his memories of Khaidi movie

మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ లో స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం అంటే 'ఖైదీ' అనే చెప్పాలి. ఆ సినిమా విడుదలై నేటికి నాలుగు దశాబ్దాలైంది. దీనిపై చిరంజీవి భావోద్వేగభరితంగా స్పందించారు. 'ఖైదీ' చిత్రం తన జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని వెల్లడించారు. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. 'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల హృదయాల్లో తనను శాశ్వత ఖైదీని చేసిందని తెలిపారు. 

"ఖైదీ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఒకసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను. ఈ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్త మూవీస్, రచయితలు పరుచూరి బ్రదర్స్ ను, ఈ సినిమాలో నాతో కలిసి నటించిన సుమలత, మాధవిలను, మొత్తం చిత్రబృందాన్ని అభినందిస్తున్నాను. అంతగొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ చిరంజీవి స్పందించారు.

More Telugu News