Chandrababu: చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి, లోకేశ్‌, కాసాని

Nara Bhuvaneswari Nara Lokesh Kasani Ganeswar meets Chandrababu
  • స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో చంద్రబాబు
  • ములాఖత్ లో చంద్రబాబును కలిసిన భార్య, కుమారుడు
  • ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం, జైల్లోని పరిస్థితులపై ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జ్ఞానేశ్వర్ తో చంద్రబాబు చర్చించారు.
Chandrababu
Nara Bhuvaneswari
Nara Lokesh
Kasani Gnaneswar

More Telugu News