Harish Rao: అమరావతితో పోల్చుతూ... హైదరాబాద్ అభివృద్ధిపై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

  • బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే బిజినెస్ పడిపోతుందనుకుంటున్నారన్న హరీశ్ రావు
  • హైదరాబాద్ కూడా అమరావతిలా మారుతుందని రియాల్టీ వ్యాపారస్తులు అనుకుంటున్నారని వ్యాఖ్య
  • పక్క రాష్ట్రంలోని రజనీకాంత్‌కు అర్థమైంది కానీ ఇక్కడి గజనీలకు అర్థం కాలేదని ఎద్దేవా
Harish rao key comments on Hyderabad development

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ లో కూడా బిజినెస్ పడిపోతుందని, అమరావతిలా మారిపోతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమరావతిలో ధరలు ఎలా పడిపోయాయో అందరం చూశామన్నారు. కేసీఆర్ రాకుంటే హైదరాబాద్ కూడా మరో అమరావతిలా మారుతుందని రియాల్టీ వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. కానీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయం పక్క రాష్ట్రంలోని సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అర్థమైంది కానీ ఇక్కడి వారికి అర్థం కాలేదన్నారు. ఇక్కడకు వచ్చిన రజనీకాంత్ మనం హైదరాబాద్‌లో ఉన్నామా? న్యూయార్క్‌లో ఉన్నామా? అని ఆశ్చర్యపోయారన్నారు. అక్కడి రజనీకి అర్థమైంది కానీ, ఇక్కడి గజనీలకు అర్థం కాలేదని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. విపక్షాలు కావాలనే రోజూ తమపై విమర్శలు చేస్తున్నాయన్నారు.

More Telugu News