మెదక్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాదయాత్ర... రేపు, ఎల్లుండి కర్ణాటక నేతల ప్రచారం
- రేపు, ఎల్లుండి తెలంగాణలో ఖర్గే, డీకే శివకుమార్ ప్రచారం
- ఎల్లుండి సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో మల్లికార్జున ఖర్గే ప్రచారం
- కార్నర్ మీటింగ్, పాదయాత్ర నిర్వహించనున్న మల్లికార్జున ఖర్గే
- రేపు డీకే శివకుమార్ తాండూరు, పరిగి, చేవెళ్ల సభలలో ప్రచారం
మరోవైపు, కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన తాండూరు, పరిగి, చేవెళ్ల సభలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కర్ణాటకలో తాను ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఖర్గే, డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ రంగంలోకి దింపుతోంది.