Pakistan: వరల్డ్ కప్: 270 పరుగులకు పాకిస్థాన్ ఆలౌట్

  • చెన్నైలో నేడు దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్
  • బాబర్ అజామ్, సాద్ షకీల్ అర్ధసెంచరీలు
  • రాణించిన షాదాబ్, రిజ్వాన్, ఇఫ్తికార్, నవాజ్
  • షంసీకి 4, యన్సెన్ కు 3 వికెట్లు
Pakistan set easy target for South Africa

భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మరోసారి పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ఇవాళ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. 

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు పాక్ చెమటోడ్చింది. సఫారీ స్పిన్నర్ తబ్రైజ్ షంసీ, పేసర్ మార్కో యన్సెన్ లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడింది. షంసీ 4 వికెట్లు తీయగా, యన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోట్జీ 2, ఎంగిడి 1 వికెట్ తీశారు. 

పాక్ జట్టుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చిందంటే సాద్ షకీల్, కెప్టెన్ బాబర్ అజామ్, షాదాబ్ ఖాన్ వల్లే. సాద్ షకీల్ 52, బాబర్ అజామ్ 50, షాదాబ్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మహ్మద్ రిజ్వాన్ 31, ఇఫ్తికార్ అహ్మద్ 21, మహ్మద్ నవాజ్ 24 పరుగులు చేశారు. 

అయితే, దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఈ టోర్నీలో విజృంభిస్తున్న తీరు చూస్తే పాకిస్థాన్ తన స్కోరును కాపాడుకోవడం కష్టమేననిపిస్తోంది.

More Telugu News