Chandrababu: ప్రాణాలకు ముప్పు ఉందంటూ చంద్రబాబు గారు రాసిన లేఖ నన్ను నిలువునా కుదిపేసింది: నారా భువనేశ్వరి

  • ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ
  • తాము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నామన్న భువనేశ్వరి
  • ఈ లేఖతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామన్న బ్రాహ్మణి
Nara Bhuvaneswari gets emotional on Chandrababu letter

రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని తెలిపారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. 

"జైలు గోడల ఆవల ఉన్న నా భర్త క్షేమం కోసం నాతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నాను. మనందరి సమష్టి ప్రార్థనలు చంద్రబాబు గారి చుట్టూ దుర్భేద్యమైన రక్షా కవచంలా నిలుస్తాయి... ఆయనను ఈ కష్టాల నుంచి క్షేమంగా గట్టెకిస్తాయి"  అంటూ నారా భువనేశ్వరి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. 


చంద్రబాబు గారి లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది: నారా బ్రాహ్మణి

చంద్రబాబు తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ పట్ల నారా బ్రాహ్మణి కూడా స్పందించారు. జైలులో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, భద్రతా పరమైన సమస్యలను వివరిస్తూ చంద్రబాబు గారు రాసిన లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది అని వెల్లడించారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

More Telugu News