G. Kishan Reddy: ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి హెచ్చరిక

  • కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని విమర్శ
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞాని అని విమర్శ
  • బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ అన్న కిషన్ రెడ్డి
Kishan Reddy hot comments to congress and brs

కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక రాజకీయ అజ్ఞాని అన్నారు. తెలంగాణ ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని, అసలు బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే బీ-టీమ్ అన్నారు. రాహుల్ గాంధీకి అసలు తెలంగాణపై ఏమాత్రం అవగాహన లేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు. తెలంగాణ ఒక మాఫియా చేతిలో బందీగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు బీజేపీ విముక్తి చేస్తుందన్నారు. బీజేపీపై ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

More Telugu News