Ambati Rambabu: మంత్రి అంబటి కారుపై పడిన గోధుమ బస్తాలు... తప్పిన ప్రమాదం

Minister Ambati Rambabu escapes unhurt in car incident
  • ఖమ్మం వైపు వెళుతున్న మంత్రి అంబటి కాన్వాయ్
  • సత్తుపల్లి వద్ద ఘటన
  • నాందేడ్ నుంచి గోధుమ లోడుతో వైజాగ్ వెళుతున్న లారీ
  • మరో వాహనంలోంచి బయటికి వచ్చిన కర్రలు తగిలి తెగిపోయిన గోధుమ లోడు తాళ్లు
  • దెబ్బతిన్న మంత్రి అంబటి కారు బాయ్ నెట్
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళుతుండగా, అనూహ్యరీతిలో ఆయన కారుపై గోధుమ బస్తాలు పడ్డాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి మంత్రి అంబటి త్రుటిలో తప్పించుకున్నారు. 

అసలేం జరిగిందంటే... అంబటి రాంబాబు కాన్వాయ్ సత్తుపల్లి వద్దకు చేరుకున్న సమయంలో, నాందేడ్ నుంచి వైజాగ్ కు ఓ లారీ గోధుమ బస్తాల లోడుతో వెళుతోంది. అయితే, సత్తుపల్లి వద్ద హోండా షోరూమ్ సమీపంలో ఓ వాహనం నుంచి బయటికి వచ్చిన కర్రలు తగలడంతో గోధుమ లోడు తాళ్లు తెగిపోయాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన మంత్రి అంబటి కారుపై రెండు గోధుమ బస్తాలు పడ్డాయి. కారు బాయ్ నెట్ బాగా దెబ్బతింది. 

ఈ ఘటనపై అంబటి పీఏ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అంబటి మరో కారులో ఖమ్మం వైపు వెళ్లిపోయారు.
Ambati Rambabu
Car
Wheat Bags
Sattupalli
Khammam
YSRCP
Andhra Pradesh

More Telugu News