Revanth Reddy: కోమటిరెడ్డి, విజయశాంతి, వివేక్, డీకే అరుణ వంటి నేతలు అందుకే బీజేపీలోకి వెళ్లారు: రేవంత్ రెడ్డి

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు చేరాలనుకుంటే అప్పుడు కాంగ్రెస్‌లోకి రావొచ్చన్న రేవంత్
  • కేసీఆర్‌పై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే వారంతా ఆ పార్టీలోకి వెళ్లారని వ్యాఖ్య
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిసి తిరిగి వస్తున్నారన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy reveals why komatireddy joined bjp

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌లో చేరుతానని ఆయనే (రాజగోపాల్ రెడ్డి) చెప్పారని, ఎప్పుడు చేరేది కూడా ఆయనే చెబుతారన్నారు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉందని, ఆయన ఎప్పుడు చేరాలనుకుంటే అప్పుడే చేరవచ్చునన్నారు. 

కేసీఆర్ అవినీతి, లక్ష కోట్ల సంపాదన మీద బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశ్యంతో రాజగోపాల్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఆ పార్టీలో చేరారని, కానీ వారు కమలం కండువా కప్పుకున్న తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని అర్థం చేసుకున్నారన్నారు.

కేసీఆర్ దోచుకున్నది వారు చూశారు... బీజేపీతో పంచుకున్నదీ చూశారని, ఇది చూసి ఇమడలేక రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని వారూ భావిస్తున్నారన్నారు.

వారు సిద్ధాంతపరంగా బీజేపీలోకి వెళ్లలేదని, తాము కాంగ్రెస్ వాదులమే కానీ రాష్ట్రంలోని అవినీతిపై చర్యలు తీసుకుంటారని బీజేపీలోకి వెళ్లినట్లు చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటారని వెళ్లారని కానీ అవినీతిలో వారికీ భాగస్వామ్యం ఉందని గుర్తించి వెనక్కి వస్తున్నారన్నారు.

More Telugu News