Bendalam Ashok: నల్ల జెండాలతో నిరసన ర్యాలీ... టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అరెస్ట్

  • ఇచ్ఛాపురంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
  • భారీ నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్
  • కవిటిలో ఉద్రిక్తత
Police arrest TDP MLA Bendalam Ashok

శ్రీకాకుళం జిల్లా కవిటిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేసి కవిటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇచ్ఛాపురంలో నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతోంది. ఈ యాత్రను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కుమార్ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 

రామయ్యపుట్టుగలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి కవిటిలో అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే అశోక్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసుల వైఖరిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

More Telugu News