Nara Bhuvaneswari: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari Nijam Gelavali tour continues on day two
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన వారి కుటుంబాలకు పరామర్శ
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటన
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' పరామర్శ యాత్ర నేడు రెండో రోజు కొనసాగుతోంది. నారా భువనేశ్వరి ఇవాళ శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కాసరం గ్రామంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్త పరుచూరు వెంకటసుబ్బయ్య గౌడ్ నివాసానికి వెళ్లారు. 

అక్కడ వెంకటసుబ్బయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. వెంకటసుబ్బయ్య కుటుంబానికి రూ.3 లక్షల చెక్ అందజేశారు. 

టీడీపీ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వెంకటసుబ్బయ్య వంటి కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు అని నారా భువనేశ్వరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు త్వరలోనే బయటికి వస్తారని,  టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె సూచించారు.
Nara Bhuvaneswari
Venkatasubbaiah Gowd
Srikalahasti
TDP
Chandrababu
Andhra Pradesh

More Telugu News