Chandrababu: అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్

Chandrababu files house motion petition in AP High Court
  • పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 
  • 3 నెలల క్రితం బాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్
  • ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందన్న న్యాయవాదులు  
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలయింది. చంద్రబాబు తరపు అడ్వకేట్లు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని... ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.

మరోవైపు, చంద్రబాబు కంటి సమస్యలకు చికిత్స అవసరమని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెపుతున్నారు. అయితే నివేదికను మార్చి ఇవ్వాలంటూ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారు మండిపడుతున్నారు. హెల్త్ బులెటిన్ లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందిస్తూ... చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు అడ్వకేట్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Chandrababu
Telugudesam
AP High Court
House Motion Petition

More Telugu News