Kapil Sibal: రాముడిని ఇంకా ఎన్ని సార్లు వాడుకుంటారు?: మోదీపై కపిల్ సిబాల్ విమర్శలు

Modi ji how many times you use Sri Ram for politics questions Kapil Sibal
  • త్వరలోనే అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు రాబోతున్నాడన్న మోదీ
  • రాముడి సద్గుణాలు బీజేపీలో కనిపించవన్న సిబాల్
  • రాముడి సద్గుణాలను మీరు ఎందుకు స్వీకరించరని మోదీకి ప్రశ్న
రాజకీయ లబ్ధి కోసం శ్రీరాముడిని బీజేపీ వాడుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ విమర్శించారు. రాముడిని వాడుకుంటున్నారే కాని... రాముడిలో ఉన్న సద్గుణాలు బీజేపీలో ఏమాత్రం కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇంకెంత కాలం రాముడిని వాడుకుంటారని ప్రధాని మోదీని ఉద్దేశించి సిబాల్ ప్రశ్నించారు. 

త్వరలోనే అయోధ్యలోని రామాలయంలోకి శ్రీరాముడు రాబోతున్నాడని... వచ్చే శ్రీరామ నవమికి ఆలయంలో జరిగే పూజలు ప్రపంచానికి ఆనందాన్ని కలిగిస్తాయని మోదీ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా కపిల్ సిబాల్ విమర్శలు గుప్పించారు. రాముడిలోని కరుణ, ప్రేమ, విధేయత, ధైర్యసాహసాలు, శౌర్యం మీలో కనిపించవని... ఆయన సద్గుణాలను మీరు ఎందుకు స్వీకరించరని ప్రశ్నించారు.  
Kapil Sibal
Narendra Modi
BJP

More Telugu News