Chiranjeevi: మెగాస్టార్ 156వ సినిమా టైటిల్ ఇదేనంటూ టాక్!

  • నిన్ననే పట్టాలెక్కిన మెగా మూవీ 
  • ఫాంటసీ జోనర్లో సాగే సినిమా 
  • 'విశ్వంభర' టైటిల్ పెట్టొచ్చని టాక్ 
  • అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్
Chiranjeevi 156th movie update

చిరంజీవి అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన 156వ సినిమాపైనే ఉంది.  యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, శ్రీవశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రామాలను జరుపుకుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఫాంటసీ జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్లు .. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయని అంటున్నారు. కంటెంట్ కొత్తగా .. వైవిధ్యభరితంగా ఉండటంతో, ఈ సినిమా టైటిల్ గురించిన అంశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎలాంటి టైటిల్ ఈ కంటెంట్ కి సెట్ కావొచ్చని చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే 'విశ్వంభర' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ కంటెంట్ కి ఈ టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని భావిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రతినాయకుడిగా రానా పేరు కూడా బలంగానే వినిస్తోంది. ఈ రెండు విషయాల్లోను అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయవలసిందే.

More Telugu News