NOTA: అభ్యర్థుల తలరాతను మార్చేస్తున్న నోటా

  • కొన్నిచోట్ల ఆధిక్యపు ఓట్ల కన్నా నోటాకు పడుతున్నవే ఎక్కువ
  • గత ఎన్నికల్లో ఏకంగా 2 లక్షలకు పైగా ఓట్లు
  • వర్ధన్నపేటలో నోటాను ఎంచుకున్న ఓటర్ల సంఖ్య 5,842
NOTA does better than candidates

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నోటా ప్రభావం తెలంగాణలో ఎక్కువగానే ఉంది. ఎంతలా అంటే.. పలుచోట్ల అభ్యర్థుల తలరాతను మార్చేంతలా! గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువ.. రాష్ట్రంలో జరిగిన కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో కూడా నోటా అట్టడుగున నిలవలేదు. పోలైన ఓట్ల జాబితాలో అన్నిచోట్లా టాప్ 5 లోనే ఉంది. గత ఎన్నికల్లో నోటాకు ఓటు వేసిన వారి సంఖ్య 2,24,709.. మొత్తం పోలైన ఓట్లలో ఇది 1.1 శాతం అని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదని చెప్పేందుకు ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సరికొత్త ప్రతిపాదనే ‘నన్ ఆఫ్ ది అబో (నోటా)’.. పోలింగ్ శాతం పెంచడం, ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నోటాను ఎంచుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5,842 (3.09 శాతం) ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు 171 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా.. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు 2,711 కావడం విశేషం. ధర్మపురి, ఇబ్రహీంపట్నం, అంబర్ పేట్, కోదాడ, వైరా నియోజకవర్గాల్లోనూ ఆధిక్యపు ఓట్లకన్నా నోటాకు పడిన ఓట్లే ఎక్కువ.

More Telugu News