Iraivan: నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'ఇరైవన్' (గాడ్) నెట్ ఫ్లిక్స్ లో!

  • తమిళంలో సెప్టెంబర్ 28న వచ్చిన 'ఇరైవన్'
  • సీరియల్ కిల్లర్ కీ .. పోలీస్ ఆఫీసర్ కి మధ్య నడిచే కథ  
  • తెలుగు ప్రేక్షకుల ముందుకు 'గాడ్' గా వచ్చిన సినిమా
  • ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Iraivan OTT streaming date confirmed

నయనతార - జయం రవి ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఇరైవన్' తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఒక సైకో చేసే వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆ సైకోను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా జయం రవి .. ఆయన ప్రియురాలిగా నయనతార కనిపిస్తారు.

తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా, 'గాడ్' టైటిల్ తో తెలుగులో ఈ నెల 13వ తేదీన విడుదలైంది. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఆశించిన స్థాయి ఆదరణను పొందలేకపోయింది. దర్శకుడు అహ్మద్ ట్రీట్మెంట్ .. స్లో నేరేషన్ కారణంగా ఈ కంటెంట్ కనెక్ట్ కాలేదనే టాక్ వినిపించింది. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమాను ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నయనతార సినిమాలకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందనేది చూడాలి.

More Telugu News