Revanth Reddy: దమ్ముంటే కేసీఆర్ కొడంగల్‌లో పోటీ చేయాలి... రాజకీయాల్లో ఎవరుండాలో డిసైడ్ అవుతుంది: రేవంత్ రెడ్డి

  • కొడంగల్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
  • కొడంగల్‌లో నామినేషన్ వేస్తా... కేసీఆర్ వస్తే తేల్చుకుంటామన్న రేవంత్
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్
Revanth Reddy challenges CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఈ రోజు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. తానూ నామినేషన్ వేస్తానని, ఇక్కడ తేల్చుకుందామన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉండాలో... ఎవరు రాజకీయాలు వదిలేయాలో ఇక్కడ డిసైడ్ అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్ని హామీలను కేసీఆర్ నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు.

కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ విధానాలతో ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు. అందుకే ఈసారి అధికార మార్పిడికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. భవిష్యత్తు అంతా కాంగ్రెస్ దే అన్నారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

More Telugu News