Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో రేపటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర

Nara Bhuvaneswari participates bus tour from tomorrow
  • ఇవాళ నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు అర్ధాంగి
  • అక్టోబరు 25 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర
  • చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పర్యటన
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వేదనతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడుతున్నట్టు తెలిపాయి. 'నిజం గెలవాలి' పేరిట నిర్వహించే ఈ యాత్ర రేపు (అక్టోబరు 25) ప్రారంభం కానుందని టీడీపీ వెల్లడించింది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో నారా భువనేశ్వరి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లెకు చేరుకుని కులదేవతలకు పూజలు నిర్వహించడం తెలిసిందే.
Nara Bhuvaneswari
Bus Tour
Nijam Gelavali
TDP
Andhra Pradesh

More Telugu News