KCR: కేసీఆర్ నియోజకవర్గ పర్యటనల్లో స్వల్ప మార్పులు

Small changes in kcr tour
  • ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తి సభలో పాల్గొననున్న కేసీఆర్
  • 27న స్టేషన్ ఘనపూర్‌కు బదులు మహబూబాబాద్, వర్ధన్నపేట సభలకు కేసీఆర్
  • మిగిలిన పర్యటనలు యథాతథం
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్... నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 26న నాగర్ కర్నూలుకు బదులు వనపర్తిలో, 27న స్టేషన్ ఘనపూర్‌కు బదులు మహబూబాబాద్, వర్దన్నపేటలలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మిగిలినవి యథాతథంగా కొనసాగుతాయి. కేసీఆర్ ఈ నెల 15న మేనిఫెస్టోను ప్రకటించారు. అదే రోజు హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున చుట్టి వస్తున్నారు. హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో విరామం ఇచ్చారు. గురువారం నుంచి మళ్లీ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు, 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో పాల్గొంటారు.
KCR
Telangana
BRS
Telangana Assembly Election

More Telugu News