Dil Raju: శ్రీదేవి, జయసుధ, జయప్రదలను ఆమె గుర్తు చేసింది: దిల్ రాజు

  • శ్రీలీల నటనకు ఫిదా అయిన దిల్ రాజు
  • ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని కితాబు
  • గొప్ప స్థాయికి చేరుకుంటుందని వ్యాఖ్య
Dil Raju praises Srileela

బాలకృష్ణ తాజా చిత్రం 'భగవంత్ కేసరి' చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన యంగ్ హీరోయిన్ శ్రీలీల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీలీల నటనకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఫిదా అయ్యారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విడుదల ముందు వరకు కూడా శ్రీలీల అంటే మంచి డ్యాన్సర్ అని అనే వారని... కానీ ఈ చిత్రంలో ఆమె నటన శ్రీదేవి, జయసుధ, జయప్రదలను గుర్తు చేసిందని కొనియాడారు. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉందని... ఆమె గొప్ప స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ సినిమా విజయోత్సవ సభలో దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... ఇప్పటికైతే ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదని చెప్పాడు. ఈ సినిమా బరువు మోసేందుకే చాలా నలిగిపోయానని అన్నాడు. సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణగారు తనకు ఇస్తే వెంటనే తీస్తానని చెప్పాడు.

More Telugu News