Nani: వినాయక్ క్లాప్ తో మొదలైన నాని కొత్త సినిమా .. 'సరిపోదా శనివారం'

  • నాని తాజా చిత్రంగా 'సరిపోదా శనివారం'
  • డీవీవీ బ్యానర్లో నిర్మితమవుతున్న సినిమా 
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ 
  • వచ్చేనెల నుంచి జరగనున్న రెగ్యులర్ షూటింగు
Nani New Movie Update

నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హాయ్ నాన్న' రెడీ అవుతోంది. ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే నాని మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయదశమి సందర్భంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వినాయక్ క్లాప్ ఇవ్వగా .. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు షాట్ కి ఎస్.జె సూర్య దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.నాని సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుంది. ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య కనిపించనున్నాడు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. జీవితంలో ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది. అలాంటి రోజు ప్రతివారం వస్తే? అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

More Telugu News