Ambati Rambabu: టీడీపీ-జనసేన కలయికపై అంబటి రాంబాబు సెటైర్లు

  • ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
  • రాజమండ్రిలో సోమవారం నాడు ఇరు పార్టీల సమన్వయ కమిటీ భేటీ
  • హాజరైన పవన్ కల్యాణ్, నారా లోకేశ్
  • ఇద్దరూ ఉత్తర కుమారులేనంటూ అంబటి వ్యంగ్యం
Ambati Rambabu satires on TDP and Janasena alliance

తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తులో నిన్న కీలక ముందడుగు పడింది. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ నిన్న రాజమండ్రిలో సమావేశం కావడం తెలిసిందే. ఈ సమావేశానికి నారా లోకేశ్, పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. సూటుకేసు తీసుకో... లోకేషుతో కలిసిపో అంటూ పవన్, లోకేశ్ లు కలిసున్న ఫొటోను పంచుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో... సొంత కుమారుడు, అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే అంటూ ఎద్దేవా చేశారు.

More Telugu News