Chennai airport: విమానాశ్రయంలో పెళ్లి సంబంధాల కియోస్క్.. నెట్టింట వైరల్

  • చెన్నై విమానాశ్రయంలో ఎలైట్ మ్యాట్రిమోనియ్ షాప్
  • దీన్ని చూసి అవాక్కవుతున్న ప్రయాణికులు
  • కనీసం మెడికల్ షాప్ కూడా లేకపోవడంపై విమర్శలు
Elite Matrimony store inside Chennai airport Passengers viral pic raises eyebrows

విమానాశ్రయాల్లో ఎన్నో రకాల షాప్ లు కనిపిస్తుంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఇదీ ఒకటి. అలాంటప్పుడు ప్రయాణికుల ప్రాథమిక అవసరాలకు సంబంధించి అన్నీ ఉండాలి కదా. అవసరమైన వాటిని పట్టించుకోకుండా, వేరే వాటికి ప్రాధాన్యం ఇస్తే ఏమనుకోవాలి? చెన్నై విమానాశ్రయంలో పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే దుకాణం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని చూసి ప్రయాణికులు అవాక్కవుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. పెళ్లి సంబంధాలు వెతికి పెట్టే ‘ఎలైట్ మ్యాట్రిమోనీ’ దుకాణాన్ని చూసిన ఓ ప్యాసింజర్ దీన్ని ట్విట్టర్ లో ఏ పేరుతో ఉన్న హ్యాండిల్ పై పోస్ట్ పెట్టారు.


‘‘ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కనీసం ఫార్మసీ స్టోర్, కన్వీనియన్స్ స్టోర్ కూడా లేదు. కానీ, నాకు ఏం కనిపించిందో మీరూ చూడండి’’ అని పోస్ట్ లో పేర్కొనడం గమనార్హం. తన పోస్ట్ ద్వారా అత్యవసర సేవలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేవారు. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. నిత్యం వేలాది మంది వచ్చిపోయే చోట ముఖ్యమైన వాటికి చోటు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఎవరికి వారు వెంట లగేజీ బ్యాగులు తెచ్చుకునేటప్పుడు, ఎయిర్ పోర్ట్ లో అన్ని లగేజీ షాప్ లు ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఇది (మ్యాట్రిమోనియల్) వాటి కంటే (లగేజీ షాపులు) మరీ దారుణం’’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

More Telugu News